ఇంద్రకీలాద్రి: శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ విజయవాడ పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. పోలీస్ బ్యాక్ డ్రాప్‌లో విజయవాడ కేంద్రంగా నిర్మిస్తున్న ఈ సినిమాల్లోని ప్రధానాంశాలను విజయవాడ రూరల్ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. స్థానిక వైఎస్సార్ కాలనీలో శనివారం వినాయక చవితి నిమజ్జనం సన్నివేశాలకు సంబంధించి హీరో శ్రీకాంత్, పోలీసులు, రౌడీల మధ్య చోటుచేసుకునే సంఘటనలను చిత్రీకరించారు. ఊరేగింపులో రౌడీలు పోలీసులపై దాడి చేసిన సన్నివేశాలతోపాటు రౌడీలు, హీరో శ్రీకాంత్‌కు మధ్య జరిగే సన్నివేశాలను షూట్‌చేశారు. జిల్లాతోపాటు నగరంలో 20రోజుల షెడ్యూల్ శనివారంతో ముగిసినట్లేనని ఆ చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఆయా సినిమాకు కరణం బాజ్జీ (శ్రీను) దర్శకత్వ వహిస్తుండగా, అనగాని ఫిలిమ్స్, సుబ్రహ్మేశ్వర ఆర్ట్ క్రియేషన్ సినిమాను నిర్మిస్తోంది. నిమజ్జనం సన్నివేశం కావడంతో స్థానిక యువత కూడా షూటింగ్‌లో భాగస్వాములయ్యారు.
దుర్గమ్మను దర్శించుకున్న కృష్ణవంశీ, శ్రీకాంత్
ప్రముఖ సినీ దర్శకులు కృష్ణవంశీ, హీరో శ్రీకాంత్ శనివారం రాత్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం కృష్ణవంశీ, శ్రీకాంత్‌లను అర్చకులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.
వైఎస్సార్ కాలనీలో శ్రీకాంత్ సినిమా షూటింగ్
Published Sun, Feb 22 2015 12:59 AM | Last Updated on Mon, May 28 2018 1:08 PM
Advertisement
Advertisement