వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల సంబరాలు
► వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులసంబరాలు
► ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై
► హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
► జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులఆనందోత్సాహాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: నగరి శాసనసభ్యురాలు ఆర్‌కే రోజాను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని కోర్టు కొట్టివేయడంతో జిల్లావ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఎమ్మెల్యే రోజా అసెంబ్లీకి హాజరు కావచ్చంటూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందంతో బాణసంచా పేల్చారు. స్వీట్లు పంచుకుని, ర్యాలీలు నిర్వహించారు బాణసంచా పేల్చారు. స్వీట్లు పంచుకుని, ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరులో వైస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రిదేవీ నేతృత్వంలో, పుత్తూరులో బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్ములు ఆధ్వర్యంలో, వడమాలపేటలో జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌రాజు, ఎంపీపీ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నగరిలో పట్టణ అధ్యక్షుడు అయ్యప్పన్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకున్నారు.
►చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో పార్టీ మండల అధ్యక్షుడు నంగా బాబురెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
► సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని బత్తాలవల్లంలో పార్టీ రాష్ట్ర నాయకుడు ఉజ్వలరెడ్డి నేతృత్వంలో స్వీట్లు పంచిపెట్టారు.