ఆర్‌బీఐతో ఆర్థికశాఖ సంప్రదింపులు.. | Greece crisis: India fears capital outflows, Finance Ministry in touch with RBI | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐతో ఆర్థికశాఖ సంప్రదింపులు..

Published Tue, Jun 30 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

ఆర్‌బీఐతో ఆర్థికశాఖ సంప్రదింపులు..

ఆర్‌బీఐతో ఆర్థికశాఖ సంప్రదింపులు..

 గ్రీస్ సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడులు దేశం నుంచి బయటకువెళ్లే పరిస్థితులు ఉన్నాయన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆర్థిక మంత్రిత్వశాఖ నిరంతరంగా ఈ సమస్యపై చర్చిస్తోంది. ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ మహర్షి సోమవారం ఈ విషయం చెప్పారు. ప్రభుత్వం సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐ కూడా భారత్ ఈ ప్రభావానికి గురికాకుండా చేయాల్సిందంతా చేస్తుందని అన్నారు. అయితే గ్రీస్ సంక్షోభం ప్రత్యక్షంగా భారత్‌పై ఎటువంటి ప్రభావం చూపబోదని ఆయన అంటూ... క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-అవుట్‌ఫ్లోస్‌కు సంబంధించి యూరోప్ ద్వారా దేశంపై ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు.
 
  ముఖ్యంగా యూరో బాండ్లు పతనమైతే (ఈల్డ్స్ పెరగడం) ఈ ప్రభావం భారత్ క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-అవుట్‌ఫ్లోస్‌పై ఉంటుందని అన్నారు. పరిస్థితి ఎటువైపు దారితీస్తుందో ఎవ్వరూ చెప్పలేరని సైతం అన్నారు. భారత్ కంపెనీ దేనికైనా గ్రీస్‌తో వ్యాపార సంబంధాలు ఏవైనా ఉన్నాయా..? అని అడిగిన ప్రశ్నకు ‘నాకు తెలియదు’ అని అన్నారు. అయితే ఈ విపరిణామాలు యూరోపియన్ యూనియన్‌పై పడితే, అది భారత్‌కూ మైనస్ అవుతుందని వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ అన్నారు. భారత్ దాదాపు 320 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో (2014-15) దాదాపు 130 బిలియన్ డాలర్ల వాటా ఈయూదే కావడం గమనార్హం. ఆందోళన అక్కర్లేదు-ఈసీఏ: కాగా ఈ విషయంపై చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (ఈసీఏ) అరవింద్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. గ్రీక్ సంక్షోభంపై ఇతర దేశాల స్పందన ఎలా ఉంటుందో. భారత్ స్పందనా అదే రీతిలో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ పరిణామాలపై ఆందోళన అక్కర్లేదని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement