మాట్రిమోనీ ఐపీవో షురూ! | Matrimony.com Limited IPO (Matrimony IPO) today | Sakshi
Sakshi News home page

మాట్రిమోనీ ఐపీవో షురూ!

Published Mon, Sep 11 2017 9:43 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

Matrimony.com Limited IPO (Matrimony IPO)  today

సాక్షి, ముంబై: ప్రస్తుత బిజీ లైఫ్‌లో  మాట్రిమోనీ.కామ్‌  ప్రాముఖ్యత, అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు.  30 లక్షల మందికిపైగా యాక్టివ్‌ ప్రొఫైల్స్‌ తో ఆన్‌లైన్‌ ద్వారా పెళ్లి సంబంధాలను కుదిర్చే  ఈ సంస్థ భారీ లాభాలనే ఆర్జించింది.  అటు  మాట్రిమోనీ.కామ్‌ లిమిటెడ్‌  పబ్లిక్‌ ఇష్యూ ఈ రోజు (సెప్టెంబర్‌ 11, సోమవారం) ప్రారంభంకానుంది.   బుధవారం  ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 983-985 మధ్య మూడు రోజులపాటుకొనసాగనుంది.


ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ నిర్ణయించింది.  భావిస్తోంది. ఆఫర్లో భాగంగా రూ. 5 ముఖ విలువగల 37.67 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు రూ. 130 కోట్ల విలువ చేసే ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇప్పటికే షేరుకి రూ. 985 ధరలో హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, బేరింగ్‌ పీఈ ఇండియా తదితర యాంకర్‌ ఇన్వెస్టర్లకు దాదాపు 23 లక్షల షేర్లను విక్రయించింది. తద్వారా రూ. 226 కోట్లు సమీకరించింది.
రిటైలర్లకు డిస్కౌంట్‌ విషయానికి వస్తే  పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా అర్హతగల కంపెనీ ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 98 డిస్కౌంట్‌ను మాట్రిమోనీ ఆఫర్‌ చేస్తోంది. అయితే కనీసం 15 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అంతకుమించి షేర్లు కొనుగోలు చేయాలంటే రూ. 2 లక్షల విలువకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీవో ద్వారా సమీకరించే నిధులను ప్రకటనలు, బిజినెస్‌ ప్రమోషన్‌, చెన్నైలో కార్యాలయం ఏర్పాటు తదితరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.  

కాగా 2001లో దేశీయ తొలి మాట్రిమోనీ కంపెనీగా ఏర్పాటైన కంపెనీఅవతరించిన భారత్‌ మాట్రిమోనీ  ఇంటర్నెట్‌, మొబైల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఆధారంగా పెళ్లి సంబంధాలు తదితర సర్వీసులను అందిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement