ముంబై: ఒకవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ర్యాలీ అవుతుండగా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య మార్కెట్ వర్గాల్లో ఆందోళన రేపింది. ఓపెనింగ్‌లోనే ఎన్‌ఎస్‌ఈ డింగ్‌లో ఎలాంటి లావాదేవీలు జరగపోవడంతో బ్రోకర్లు, బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు గందరగోళంలో పడిపోయారు. సాంకేతిక సమస్యల కారణంగా ఎన్‌ఎస్‌ఈలో షేర్ల ధరలు అప్‌డేట్ కావడంలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అటు ఎన్‌ఎస్‌ఈ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మరింత ఆందోళనకు దారి తీసింది. అయితే ట్రేడింగ్ ప్రారంభమైన 45 ని.లవరకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే దీనిపై ఎన్‌ఎస్‌ఈ తాత్కాలిక చీఫ్ రవిచంద్రన్ స్పందించారు. ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్ లో సాంకేతిక లోపం ఏర్పడిందని పరిశీలిస్తున్నామని చెప్పారు. త్వరలోనే సమస్యలను పరిష‍్కరిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్‌ఎస్‌ఈలో క్యాష్, ఎఫ్ అండ్‌వో సెగ్మెంట్‌ను లో ట్రేడింగ్ తాత్కాలికంగా మూసి వేసినట్టు ప్రకటించారు.
మరోవైపు ఈ గందరగోళం నేపథ్యంలో బీఎస్‌ఈని కూడా మూసివేసి, మళ్లీ ప్రెష్‌గా మార్కెట్లు ప్రారంభించే అవకాశం ఉందని ఎనలిస్టులుఅంచనావేశారు. ఈ అంచనాలకనుగుణంగానే 10.45 ని.లకు మరోసారి స్టాక్‌మార్కెట్లు మొదలుకానున్నాయి.