మన ఐటీ రంగంపై పరిమితంగానే గ్రీసు సంక్షోభ ప్రభావం | Our IT sector Limited Greece crisis | Sakshi
Sakshi News home page

మన ఐటీ రంగంపై పరిమితంగానే గ్రీసు సంక్షోభ ప్రభావం

Published Thu, Jul 2 2015 12:04 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

మన ఐటీ రంగంపై పరిమితంగానే గ్రీసు సంక్షోభ ప్రభావం - Sakshi

మన ఐటీ రంగంపై పరిమితంగానే గ్రీసు సంక్షోభ ప్రభావం

న్యూఢిల్లీ: గ్రీసు సంక్షోభ ప్రభావం భారత్‌లోని ఐటీ కంపెనీల ఆదాయాలపై 1-2 శాతంగా ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్’ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) తెలిపింది. యూరో-రూపీ మారకపు రేట్ల ప్రభావం, యూరప్‌లోని ఇతర దేశాల అభివృద్ధి వంటి అంశాలు ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతాయని వివరించింది. భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు యూరప్‌తో సంబంధాలను కలిగి ఉన్నాయని, గ్రీసుతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని పేర్కొంది. భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉత్తర యూరప్ దేశాలు, స్విట్జర్లాండ్ వంటి దేశాలతో సంబంధాలను కలిగి ఉన్నాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement