కిష్టయ్య మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు
సిద్దిపేటటౌన్: రోజు మా దిరిగానే మిల్లులో కూలీ పని చేయడానికి వెళ్లిన వ్యక్తి అదుపు తప్పి కింద పడడంతో అతను మోస్తున్న సంచి మీద పడి ఊపిరాడక చనిపోయిన ఘటన సోమవారం సిద్దిపేట పట్టణంలో చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు, తోటి హమాలీలు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాయపల్లికి చెందిన ఎక్కల్‌దేవి కిష్టయ్య(48) చాలా కాలంగా లింగారెడ్డిపల్లి గ్రామ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటూ స్థానిక కుంకుమ మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు.
ఎప్పటిలాగే సోమవారం ఉదయం పనికి వచ్చిన కిష్టయ్య చింత గింజల సంచి మోసుకుంటూ వెళ్తుండగా కిందున్న సంచుల మధ్యలో జారి పడ్డాడు. ఈ క్రమంలో కిష్టయ్య ఎత్తుకున్న సంచి అతడిపై పడింది. దీంతో ఊపిరి ఆడక మృతిచెందాడు.
చాలా సేపటి తర్వాత గమనించిన తోటి కార్మికులు సంచి తొలగించి చూడగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు మిల్లు వద్దకు చేరుకుని బోరున విలపించారు. కాసేపు మిల్లు ఎదుట ఆందోళన చేపట్టారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment