అన్న కాదు.. కీచకుడు | brother raped sister and give birth to male child | Sakshi
Sakshi News home page

అన్న కాదు.. కీచకుడు

Published Tue, Nov 28 2017 11:11 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

brother raped sister and give birth to male child - Sakshi

శివమొగ్గ: చెల్లెలు వరసయ్యే బాలికకు మత్తుమాత్రలు ఇచ్చి ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడగా, బాలిక గర్భవతై మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకాలో ఆలçస్యంగా వెలూగు చూసింది. వివరాలు.. యువరాజ్‌ నాయక్‌ (22) అనే కీచకుడు తన చిన్నాన్న కూతురు (16)పై కన్నేశాడు. ఆమె ఇంటర్‌ చదువుతోంది. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. దీంతో నిందితుడు తరచూ వారి ఇంటికి వెళ్తూ బాలికకు మాయమాటలు చెప్పి నిద్రమాత్రలు ఇస్తూ అత్యాచారం జరిపేవాడు.

ఈ నెల 24వ తేదీన బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రాగా, ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు జరిపిన వైద్యులు బాలిక 8 నెలల గర్భవతిగా గుర్తించారు. నొప్పులు పెరగడంతో వైద్యులు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి మగబిడ్డను వెలికితీశారు. బాలిక ఈ బిడ్డ తనకు వద్దని చెప్పడంతో పిల్లల దత్తత కేంద్రానికి అప్పగిస్తామని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. బాలికకు నిద్ర మాత్రలు ఇచ్చి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువరాజ్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement