పెళ్లి చూపులకెళ్లాల్సిన వాడు.. | Driver death caused by tractor rolling accidents | Sakshi
Sakshi News home page

పెళ్లి చూపులకెళ్లాల్సిన వాడు.. మృత్యు ఒడికి చేరాడు!

Published Thu, Nov 30 2017 7:52 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Driver death caused by tractor rolling accidents - Sakshi

కృష్ణ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు (ఇన్‌సెట్లో) కృష్ణ(ఫైల్‌)

కౌతాళం రూరల్‌ : కొద్దిసేపట్లో పెళ్లి చూపులకెళ్లాల్సిన ఓ యువకుడిని మృత్యువు ట్రాక్టర్‌ రూపంలో కబళించింది. పోలీసులు వివరాల మేరకు.. ఓబుళాపురం గ్రామానికి చెందిన కుమ్మరి తిమ్మయ్య, అయ్యమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు కుమ్మరి కృష్ణ(22) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు.  కృష్ణ బుధవారం పెళ్లి చూపుల నిమిత్తం కోసిగి మండలం గౌడుగళ్లుకు  వెళ్లాల్సి ఉంది. రెండెకరాల్లో పత్తిపంట తొలగించాల్సి ఉండడంతో త్వరగా పని ముగించుకుని వెళ్దామనుకున్నాడు.

రోటోవేటర్‌లో చిక్కుకుని..
పనిలో ఉండగా గాలిపైపు ట్రాక్టర్‌ రోటోవేటర్‌కు చిక్కుకోవడంతో ట్రాక్టర్‌ నడుపుతూనే దాన్ని తొలగించేందుకు యత్నించాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి రోటోవేటర్‌లో చిక్కుకోవడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ట్రాక్టర్‌ దాదాపు 100 మీటర్లు ముందుకెళ్లి గుంతలో పడి నిలిచిపోయింది. ఈ తర్వాత గమనించిన కూలీలు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పెళ్లి చూపులకెళ్లాల్సిన కొడుకు విగతజీవిగా కనిపించడంతో తల్లి కన్నీరుమున్నీరైంది. ఆమె రోదించిన తీరు చూపురులను కంటతడి పెట్టించింది. ఎస్‌ఐ సుబ్రహ్మణ్యంరెడ్డి కేసు నమోదు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement