సాక్షి, తిరుపతి : నగరంలో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి డాక్టర్ ముసుగులో చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే ఏర్పేడు మండలం గుడిమల్లంకు చెందిన కాటూరి ఉదయ్ కుమార్ తన భార్య చికిత్స కోసం రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని గోపీమాధురి ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఆమెకు 103వ గదిలో ఉంచి వైద్య సేవలు అందించారు.
నిన్న (శుక్రవారం) ఓ వ్యక్తి డాక్టర్ తరహాలో కోటు ధరించి ఆ గదిలోకి వెళ్లాడు. రోగికి చికిత్స చేయాలంటూ ఆమె కుటుంబసభ్యులను బయటకు పంపించాడు. అనంతరం మహిళ మెడలోని 50 గ్రాముల బంగారు గొలుసు తీసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే మహిళ మెడలో బంగారు గొలుసు మాయం అవడాన్ని గమనించిన రోగి బంధువులు ఆస్పత్రి నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. కాగా గొలుసు చోరీ చేసిన అనంతరం నకిలీ వైద్యుడు దర్జాగా ఫోన్ మాట్లాడుకుంటూ.. బయటకు వెళుతున్న సంఘటనలు సీసీ టీవీ ఫుటేజ్‌కు చిక్కాయి. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీనని పరిశీలించిన పోలీసులు... నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment