ముంబై: నగరంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న టీనేజర్‌ను అతని రూమ్‌మేట్స్ నగ్నంగా ఫొటోలు తీసి.. డబ్బులు ఇవ్వాలని, లేకపోతే నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. దీంతో పాల్ఘర్ వాంగావ్‌లో తాము ఉంటున్న అద్దె గదిలోనే ఉరేసుకొని టీనేజర్ ప్రాణాలు విడిచాడు. పోలీసుల విచారణలో నిందితుడి ఫోన్‌లో మృతుడి నగ్న ఫొటోలు దొరికాయి.
ఈ ఘటనలో మృతుడు, నిందితుడు బోయిసార్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే గదిలో అద్దెకు ఉంటున్నారు. కొన్నివారాల కిందట తమ గదిలో టీనేజర్, నిందితుడు, మరో వ్యక్తి మద్యం సేవించారు. ఈ క్రమంలో టీనేజర్ నిద్రలోకి జారుకోగా.. అతని దుస్తులు విప్పి.. నిందితుడు నగ్నంగా ఫొటోలను తీశాడు. తెల్లారి లేచిన తర్వాత ఆ ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. మొదట జోక్ చేస్తున్నాడని టీనేజర్ భావించాడు. కానీ, సహోద్యోగి కూడా అయిన రూమ్‌మేట్ మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేకపోతే ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు దిగాడు. ఆఖరికీ పనిచేస్తున్న కంపెనీలోనూ ఇదే తరహాలో బ్లాక్‌మెయిల్ చేయడంతో గత సోమవారం సహోద్యోగి ఉద్యోగానికి వెళ్లిన తర్వాత అద్దె గదిలో ఒంటరిగా ఉన్న బాధితుడు ఉరేసుకున్నాడు. నిందితుడి నుంచి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫొటోలు డిలీట్ చేయాల్సిందిగా టీనేజర్ ప్రాధేయపడుతూ చేసిన మెసేజ్‌లను నిందితుడి ఫోన్‌లో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment