బెంచ్‌మార్క్‌లా తయారు చేసేందుకు కృషి
హైదరాబాద్: రాష్ట్రంలో చాలా రంగాల్లో కొత్తగా ముందుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌ను కూడా దేశంలో ఒక బెంచ్‌మార్క్‌లా తయారు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. 29న నిర్వహించనున్న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సోమవారం నిర్వహిం చిన ఎడిటర్స్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలం ఉందని దీన్ని కేవ లం రిక్రియేషన్ క్లబ్‌లా కాకుండా జర్నలిస్టులకు ఉపయోగపడేలా రూపొందించాలని కేటీఆర్ పేర్కొన్నారు. జర్నలిస్టులందరికీ ఉపయోగపడే కార్యక్రమాలపై నిర్ధిష్ట ప్రణాళిక రూపొందించాలన్నారు. నెలలో ఒకసారైనా యువ జర్నలిస్టులకు సీనియర్లతో ముఖాముఖి ఏర్పాటుచేసి అనుభవాలు పంచుకోవాలని సూచించారు.
గోల్డెన్ జూబ్లీ వేడుకలను యూనియన్లకు అతీతంగా అందరూ కలసి నిర్వహించుకోవాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి అన్నారు. క్లబ్‌లో పిల్లలు ఆడుకోవడానికి వసతులు, లైబ్ర రీ, మెడికల్ సెంటర్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జర్నలిస్టుల సమస్యలు ఒక్కొక్కటిగా తీరుస్తామని ఐఅండ్‌పీఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. ప్రెస్‌క్లబ్‌ను యూనియన్లకు, ప్రాంతాలకు సంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడేలా చేయాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు.
జర్నలిస్టులు ఉరుకులు పరుగులు పెట్టకుండా సెక్రటేరియట్‌లో ఏ విభాగంలో సమావేశాలు జరిగినా ఐఅండ్‌పీఆర్ నుంచి ప్రెస్‌క్లబ్‌కు వీడియోలు, ప్రెస్‌కాపీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ కమిషనర్ విజయ్‌బాబు సూచించారు. కార్యక్రమంలో దినపత్రికల ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు ఐ.వెంకట్రావ్, కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణ, నగేష్, శ్రీనివాస్, వేణుగోపాల్, శైలేష్‌రెడ్డి, క్రాంతితో పాటు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రవి కాంత్‌రెడ్డి, సెక్రటరీ రాజమౌళిచారి, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.