‘అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుంటాం’ | bjp lakshman slams trs government | Sakshi
Sakshi News home page

‘అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుంటాం’

Published Mon, May 16 2016 4:03 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

bjp lakshman slams trs government

సిద్దిపేట రూరల్: అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వారి ఆగడాలను బీజేపీ అడ్డుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఆయన కరీంనగర్ వెళుతూ మార్గమధ్యంలో సిద్దిపేట వద్ద కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా ఉండాలని కోరుకుంటోందని విమర్శించారు. రాష్ట్రమంతా కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ఆయన వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement