మెదక్‌ ఉపఎన్నికలో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది | bandaru dattatreya takes on trs | Sakshi
Sakshi News home page

మెదక్‌ ఉపఎన్నికలో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది

Published Sat, Sep 13 2014 5:52 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మెదక్‌ ఉపఎన్నికలో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది - Sakshi

మెదక్‌ ఉపఎన్నికలో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది

ఢిల్లీ: మెదక్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజార్టీ తగ్గడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన ఆయన.. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో భయాన్ని, అనుమానాలను సృష్టిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీపై ఏర్పడ్డ ప్రజావ్యతిరేకతను తాము అనుకూలంగా మలుచుకుంటామని తెలిపారు. తెలంగాణ విద్యుత్ కొరత ఉన్నందున భారీ ప్రాజెక్టు అంశాన్ని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

 

తెలంగాణకు నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పాలని పీయూష్ గోయల్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ లకు విన్నవించినట్లు ఆయన పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement