పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, అధికారులు
భవనాలు, స్థలాలు పరిశీలించిన కలెక్టర్
Published Thu, Sep 29 2016 11:35 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
వనపర్తి : పది రోజుల్లో జిల్లా కేంద్రంగా మారనున్న వనపర్తిలో తాత్కాలిక, శాశ్వత ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం గురువారం కలెక్టర్ టీకే శ్రీదేవి పట్టణంలోని భవనాలు, స్థలాలను పరిశీలించారు. వనపర్తి సంస్థానాదీశుల రాంసాగర్ రాజమహల్, మిషన్ కంపౌండ్‌లోని భవనాలు, పాలశీతలీకరణ కేంద్రం, ఇంటర్ ఒకేషనల్ కళాశాల నూతన భవనాలతో పాటు శ్రీనివాసపురం గ్రామంలోని 55 సర్వే నంబర్ పరిధిలోని భూమిని పరిశీలించారు. శ్రీనివాసపురం గ్రామ శివారులోని ఫారెస్టు భూమిని పరిశీలించారు. పట్టణంలో అధికారులు ఇదివరకే గుర్తించిన భవనాలు, ఖాళీ స్థలాల మ్యాప్‌లను పరిశీలించారు. పాలశీతలీకరణ కేంద్రంలో శాశ్వత కలెక్టర్ బంగ్లా నిర్మాణం కోసం కావాల్సిన స్థలాల మ్యాప్‌ను ఆమె పరిశీలించారు. అధికారులు తయారు చేసిన ప్రతిపాదిత ఫైల్‌ను ఆమె తీసుకొని త్వరలో ఎంపిక చేసిన భవనాల వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
Advertisement