ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
పూడూరు: యువతితో సహజీవనం చేసి మరో పెళ్లికి సిద్ధమైన ఓ ప్రభు త్వ ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. మండల పరిధిలోని కండ్లపల్లికి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన జెట్టి రాజులు ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ సహజీవనం చేస్తున్నారు. యువతి నగరంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా రాజు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఇద్దరూ కొంతకాలంగా నగరంలోనే ఉంటున్నారు.
అయితే, రా జు తనను మోసం చేసి మరో పెళ్లికి సిద్ధమయ్యాడని, ఈనెల 29న శుక్రవారం చేవెళ్లలో పెళ్లి చేసుకుంటున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు. అయితే, తాను యువతిని ప్రేమించలేదని, తనతో నాకు ఎలాం టి సంబంధం లేదని రాజు స్పష్టం చేశాడు. ఉద్దేశపూర్వకంగానే కేసు బనా యించారని తెలిపారు.