పెద్దాస్పత్రిని పరిశీలించిన డీఎంఈ బృందం
నెల్లూరు(అర్బన్):
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (రాష్ట్ర వైద్య విద్యాశాఖ) నుంచి వచ్చిన బృందం శుక్రవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న పెద్దాస్పత్రి ట్రామాకేర్ సెంటర్‌ను, బర్న్స్(కాలినగాయాల) వార్డును ప్రత్యేకంగా పరిశీలించింది. అనంతరం ప్రిన్సిపల్, కొంతమంది డాక్టర్లతో ఆ బృందం ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ట్రామా, కాలిన గాయల వార్డులకు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయబోతోందన్నారు. ఇందుకు సంబందించి మొదట ఇక్కడి వివరాలను తనిఖీ బృందం కేంద్రానికి నివేదిక రూపంలో ఇవ్వనుందని చెప్పారు. తనిఖీ బృందంలో వైద్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కె.బాబ్జి, రీజినల్ డెరెక్టర్ డాక్టర్ అనూరాధ మెడోజు, ఢిల్లీ నుంచి వచ్చిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హారీష్‌కుమార్‌లున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల, డాక్టర్ కాలేషా పాల్గొన్నారు.