యంత్ర తంత్రం | Encouraged by the establishment of a subsidiary of the agricultural industry | Sakshi
Sakshi News home page

యంత్ర తంత్రం

Published Sat, Nov 26 2016 4:29 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

యంత్ర తంత్రం

యంత్ర తంత్రం

జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం
ఔత్సాహికులకు మరింత చేయూత
ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటే చాలు
కార్యాలయాల చుట్టూ తిరగకుండానే  సింగిల్ విండో అనుమతులు
ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్న  పరిశ్రమల శాఖ

హన్మకొండ : వరంగల్ రూరల్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. వరితో పాటు ఇతర పంటలు కూడా విస్తారంగా పండుతుండగా దీనికి అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యారుు. అరుుతే, ఇంకా పరిశ్రమల స్థాపనతో మరికొందరికి ఉపాధి అవకాశాలు సృష్టించాలనుకునే యువతను ప్రోత్సహించే దిశగా అడుగులు పడుతున్నారుు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా ఔత్సాహికులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నారుు. ఇందులో భాగంగా వివిధ రకాల యూనిట్ల అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ నెలలు, ఏళ్ల తరబడి తిరిగే పని లేకుండా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి అన్నీ సవ్యంగా ఉంటే కేవలం పదిహేను రోజుల్లోనే అనుమతి ఇవ్వనున్నారు. ఇప్పటివరకు వ్యవసాయ ప్రధాన జిల్లాగా పేరొందిన వరంగల్ రూరల్ జిల్లాలో అనుబంధ పరిశ్రమలకు స్థాపించేలా ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు  అటు కలెక్టర్, ఇటు పరిశ్రమల కేంద్రం అధికారులు వ్యూహం రూపొందించి అమలుకు సిద్ధమయ్యారు.

అనుబంధ రంగాల్లో..
పాఖాల సరస్సు, మాధన్నపేట చెరువు, చలివాగు ప్రాజెక్టు వంటి నీటి వనరులు పుష్కలంగా ఉన్న వరంగల్ రూరల్ జిల్లాలో వ్యవసాయం వేలాది ఎకరాల్లో సాగుతోంది. ఇందులో వరి అగ్రస్థానంలో ఉండగా.. పత్తి, మిర్చి, మొక్కజొన్న కూడా దాదాపు అదే స్థానంలో పండిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో పత్తి, మిర్చి, మొక్కజొన్న, వరి పంటలు అధికంగా పండుతుండడంతో వీటికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్, స్పిన్నింగ్, టెక్నాలజీ మిషన్ ఆఫ్ కాటన్(ఆటోమేటిక్ కాటన్ మిల్స్), మిర్చి, పసుపు పౌడర్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు పలువురు సిద్ధపడుతున్నారు. ఇలా ముందుకొచ్చే వారికి సహకరించేందుకు పరిశ్రమల శాఖ సిద్ధమైంది. మరోవైపు జిల్లాలోని సంగెం, గీసుకొండ మండలాల్లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండడంతో అందుకు అనుబంధంగా కూడా పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. నర్సంపేట ప్రాంతంలో మిర్చి, పసుపు పొడి ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కూడా పలువురు అనుకూలంగా ఉన్నారు. వీరితో పాటు పాకాల కింద వరి విరివిగా పండుతుండగా రైస్ మిల్లులు ఏర్పాటు చేసేవారికీ ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా స్టార్టప్ కంపెనీలకు సైతం ప్రోత్సాహం ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

అంతా ఆన్‌లైన్
సేవలతో పాటు ఉత్పత్తి రంగాల్లో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులను పరిశీలించనున్న అధికారులు దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు సేకరిస్తారు. అన్నీ సవ్యంగా ఉన్నాయనుకుంటే కేవలం మూడు నుంచి పదిహేను రోజుల్లో పరిశ్రమలకు అనుమతి ఇస్తారు. అలాగే, బ్యాంకర్ల సహకారంతో సబ్సిడీపై యూనిట్ల స్థాపనకు అన్ని అనుమతులు ఇప్పించేందుకు సింగిల్ విండో విధానాన్ని అవలంభించనున్నారు.

వంద శాతం సేల్స్‌ట్యాక్స్ రీరుుంబర్స్‌మెంట్
పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చేవారు అనుమతుల కోసం ఏ కార్యాలయం చుట్టూ తిరిగే పనిలేకుండా సింగిల్ విండో విధానం ఏర్పాటుచేశాం. ఈ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే అన్ని అనుమతులు ఇప్పిస్తాం. పరిశ్రమలు స్థాపించి పలువురికి ఉపాధి కల్పించే వ్యవస్థాపకులకు 100శాతం సేల్స్ ట్యాక్స్ రీరుుంబర్స్‌మెంట్ వస్తుంది. అదేవిధంగా విద్యుత్ చార్జీ ఒక్క యూనిట్‌కు రూ.1 మాత్రమే చెల్లించాలి. ఔత్సాహికులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. - మిట్టపల్లి హరిప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement