విధులకు రండి, జీతాలు పెంచుతాం.. | GHMC commissioner somesh kumar appeals staff to call off strike | Sakshi
Sakshi News home page

విధులకు రండి, జీతాలు పెంచుతాం..

Published Mon, Jul 13 2015 2:07 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

విధులకు రండి, జీతాలు పెంచుతాం.. - Sakshi

విధులకు రండి, జీతాలు పెంచుతాం..

సికింద్రాబాద్ : మున్సిపల్ కార్మిక సంఘాలతో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సోమవారం చర్చలు జరిపారు. సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లోకి చేరాలని ఆయన కోరారు. విధులకు హాజరైతే జీతాలు పెంపు, ఇతర డిమాండ్లపై వెంటనే సానుకూల నిర్ణయం ఉంటుందని సోమేశ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన కార్మిక సంఘాలతో వివరించారు. వేతనాలు పెంపుతో పాటు తమ డిమాండ్ల సాధన కోసం పారిశుద్ధ్య కార్మికులు గత ఎనిమిది రోజుల నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement