ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, నాగార్జున సాగర్ కింద రెండు పంటలకు నీళ్లు నెరవేరిస్తే టీఆర్‌ఎస్‌కు ప్రచార కార్యకర్తగా పనిచేస్తానని మాజీ హోంమంత్రి, సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి సవాల్ విసిరారు. అంతకుముందు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయన మనవడికి అన్నప్రాశనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ బిక్షమయ్యగౌడ్ పాల్గొన్నారు.
ఆ రెండు హామీలు నెరవేరిస్తే ప్రచార కార్యకర్తగా పనిచేస్తా
Published Sun, Jul 3 2016 7:57 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement