చిట్టీల పేరుతో రూ.3 కోట్లు వసూలు.. పరార్! | private chit trader couple escapes with crore amount | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో రూ.3 కోట్లు వసూలు.. పరార్!

Published Tue, Nov 29 2016 11:07 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

చిట్టీల పేరుతో రూ.3 కోట్లు వసూలు.. పరార్! - Sakshi

చిట్టీల పేరుతో రూ.3 కోట్లు వసూలు.. పరార్!

అనకాపల్లి: విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో చిట్టీల పేరుతో దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. విశాఖ పట్టణానికి చెందిన కొణతాల ఉదయ్ శ్రీనివాస్, జయశ్రీ భార్యాభర్తలు. గత కొన్నేళ్లుగా వీరు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. నమ్మకంగా ఉంటూ ప్రజల నుంచి దాదాపు రూ.3 కోట్లు వరకు వసూలు చేసిన ఈ దంపతులు కొన్ని రోజులుగా కనిపించకుండాపోయారు.

వారి గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాకబు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై స్పందించటం లేదంటూ మంగళవారం సాయంత్రం శ్రీనివాస్ ఇంటి ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడినుంచి పంపించివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement