నకిలీ పర్మిట్లతో శనగ విత్తనాలు స్వాహా
Published Fri, Oct 14 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
- అక్రమార్కునికి టీడీపీ నాయకుల అండ
ఆలూరు: నకిలీ పర్మిట్లతో రైతులకు మంజూరు చేస్తున్న రాయితీ విత్తనాలను ఓ ఘనుడు స్వాహా చేశారు. ఇతనికి టీడీపీ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. హాలహర్వి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రైతుల పేరు మీద నకలీ బిల్లలను కలర్ ప్రింట్ జిరాక్స్ తీసి.. 10 నుంచి 15 మంది దళారులను తయారు చేసుకుని రైతులకు అందాల్సిన శనగ విత్తనాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. దాదాపు వంద క్వింటాళ్లు శనగ విత్తనాన్ని సేకరించి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా కేంద్రానికి తరలించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు, రైతులు ఆలూరు ఏడీఏ, కేడీసీఎంఎస్ గోదాము ఇన్‌చార్జీ మురళికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Advertisement
Advertisement