- ఆదెమ్మదిబ్బలో అక్రమార్కుల బరితెగింపు
- అడ్డుకున్న బ్రాహ్మణ మహిళలు
- ఆధారాలు చూపాలని గద్దించడంతో వెనుదిరిగిన వైనం
- స్థల యజమానిదినకరప్రసాద్‌పై కోర్టులో కేసు
కబ్జా కోసం కంచె
Published Fri, Dec 30 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
రూ. వంద కోట్ల విలువైన 3.54 ఎకరాల ఆదెమ్మదిబ్బను ఆక్రమించేందుకు కబ్జాదారులు బరితెగిస్తున్నారు. తాజాగా అక్కడ ఉన్న 10 కుటుంబాల పేద బ్రాహ్మణుల ఇళ్లను కలుపుతూ కంచె వేయడానికి యత్నించి మహిళలు ప్రతిఘటించడంతో జారుకున్నారు. 50 ఏళ్లుగా ఉంటున్నామని, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఏమిటో చూపాలని నిలదీయడంతో వాళ్లు సద్దుకోవాల్సి వచ్చింది. ఈ స్థలం సత్యవోలు పాపారావు తమ్ముడు లింగమూర్తిదని, ఆయన తండ్రి, తమ తాతకు ఈ స్థలం ఇస్తామని చెప్పాడని, చెరువును పూడ్చి పూరిగుడిసె నుంచి ఇప్పడు రేకుల షెడ్డుకు తమ నివాసాన్ని మార్చుకున్నామన్నారు. లింగమూర్తి పెద్దకుమారుడు లక్షీ్మపతి ఇంట్లో తాము పని చేశామని, ఆయన కూడా ఈ స్థలం తమకు రిజిస్ట్రేష¯ŒS చేయిస్తానని మాట ఇచ్చారన్నారు. తమ 10 కుటుంబాలు ఉన్న స్థలాన్ని మా పేర్ల రిజిస్ట్రేష¯ŒS చేసేందుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోమని చెప్పారని, అయితే 2005లో ఆయన చనిపోయాకా తాము లక్షి్మపతి తమ్ముడు సత్యవోలు దినకర ప్రసాద్ వద్దకు వెళ్లగా ఆయన తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపారు. దీంతో తామందరం 2007లో ఆయనపై కోర్టుకు వెళ్లామని చెప్పారు. ఈ కేసు రాజమహేంద్రవరం జూనియర్ సివిల్ జడ్డి వద్ద నడుస్తోందని తెలిపారు. ఐఏ నం. 1502/2016, ఓఎస్ నం. 685/2007 అని తెలిపారు. తాజాగా ఎవరో వచ్చి ఈ స్థలం తాము సత్యవోలు శేషగిరిరావు వద్ద డెవలప్‌మెంట్‌కు తీసుకున్నామని చెబుతూ ఖాళీ చేయాలని వచ్చారని, స్థలం డాక్యుమెంట్లు అడిగితే ఎదురు ప్రశ్నిస్తున్నారని దుగ్గిరాల శ్రీదేవి అనే మహిళ పేర్కొన్నారు. అయితే కోర్టు కేసులు పూర్తయిన తర్వాత తమకు ఏదో ఒక న్యాయం చేస్తానని దినకర ప్రసాద్ చెప్పారని ఆమె తెలిపారు.
కబ్జాదారుల బరితెగింపు
ఆదెమ్మదిబ్బ స్థలంలో ఉత్తరంవైపు 38వ డివిజ¯ŒSలో ఉన్న పేదలను భయభ్రాంతులకు గురిచేసిన ఆక్రమణదారులు వారికి నగదు ఇచ్చి ఖాళీ చేయించారు. పక్కనే వాంబే ఇళ్లలో ఉన్నవారు, ఐదు పదేళ్ల నుంచి అక్కడ గుడిసెలు వేసుకున్న వారు ఆ నగదు తీసుకుని వెళ్లిపోయారు. కానీ 50 ఏళ్ల నుంచి ఉంటున్నవారు మాత్రం తాము ఖాళీ చేసేది లేదని, సత్యవోలు పాపారావు తమకు తెలుసని, వారి కుమారులు వస్తే వారితో మాట్లాడుకుంటామని చెప్పి అక్కడే ఉండిపోయారు. దీంతో ఖాళీ చేయబోమని చెప్పిన పేదల గుడిసెలను కలుపుతూ వారిళ్లకు వెళ్లేందుకు దారిలేకుండా ముళ్ల కంచె వేశారు. ఎలాంటి ఆధారం లేని వారు ఇంట్లోకి వెళ్లి రావడానికి నానా కష్టాలు పడుతున్నారు. అదే స్థలంలో ఉన్న చర్చిని కలుపుతూ కూడా ముళ్ల కంచె వేశారు. తాజాగా దక్షిణం వైపు 36వ డివిజ¯ŒSలోని పేద బ్రాహ్మణుల ఇళ్లను కలుపుతూ కంచె వేయడానికి ప్రయత్నించగా మహిళలు ప్రతిఘటించడంతో కబ్జాదారులు వెనక్కు తగ్గారు.
Advertisement
Advertisement