- సత్తా చాటిన కరీంనగర్, తిమ్మాపూర్ మండలాలు
- 7 మండలాల నుంచి 500 మంది క్రీడాకారులు హాజరు
కరీంనగర్ రూరల్ జోన్ క్రీడలు ప్రారంభం
Published Wed, Sep 7 2016 10:46 PM | Last Updated on Tue, Jun 4 2019 6:28 PM
కరీంనగర్: జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో 2016–17 విద్యాసంవత్సరానికి నిర్వహిస్తున్న కరీంనగర్ రూరల్ జోన్ క్రీడోత్సవాలు బుధవారం అంబేద్కర్ స్టేడియంలో పారంభమయ్యాయి. పోటీలను ఉపవిద్యాధికారి వెంకటేశ్వర్ రావు క్రీడాపతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. సింధు,సాక్షి మాలిక్ లను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.
రూరల్ జోన్ పరిధిలోని 7 మండలాల నుంచి సుమారు 500 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 14, 17 బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ అంశాలలో, అండర్ 17 బాలికలకు ఖోఖో పోటీలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన బహుమతి కార్యక్రమానికి తిమ్మాపూర్ ఎంపీపీ బూడిద ప్రేమలత, ఉపవిద్యాధికారి వెంకటేశ్వర్ రావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి తిరుపతి రెడ్డి లు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కరీంనగర్ రూరల్ జోన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, మండల కార్యదర్శులు బిట్ర శ్రీనివాస్, సమ్మయ్య, రవి కుమార్, పిఈటీ, పీడీలు యూనిష్ పాష, సత్యానంద్, కృష్ణ, గోపాల్, శ్రీ లక్ష్మీ, సంధ్య, రూపారాణి పాల్గొన్నారు.
సత్తాచాటిన కరీంనగర్, తిమ్మాపూర్...
బాలుర విభాగంలో జరిగిన పోటీల్లో కరీంనగర్, తిమ్మాపూర్ మండలాల జట్లు సత్తా చాటాయి. తిమ్మాపూర్ జట్టు కబడ్డీ, ఖోఖోలో విజయం సాధించగా, కరీంనగర్ మండల జట్లు వాలీబాల్, ఖోఖోలో గెలుపొందాయి.
Advertisement
Advertisement