రైలు నుంచి పడి వ్యక్తి మృతి
Published Wed, Jul 20 2016 10:41 PM | Last Updated on Mon, Oct 1 2018 6:22 PM
డోర్నకల్ : డోర్నకల్–గార్ల రైల్వేస్టేషన్ల మధ్య రైలు నుంచి పడిన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. డోర్నకల్ జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ సురేష్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్–గార్ల స్టేషన్ల మధ్య గార్ల గేట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామని తెలిపారు.
మృతదేహం వద్ద లభించిన ఆధారాల ప్రకారం మృతుడు మహబూబాబాద్ సుందరయ్యనగర్‌కు చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ పెండ్ర రఘుబాబు(27)గా గుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుడు గుర్తు తెలియని రైలు నుంచి జారి పడి లేదా రైలు ఢీకొని మృతి చెంది ఉండొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని వివరించారు.
Advertisement
Advertisement