గొడవ పడ్డాడని రైల్లోంచి గెంటేశాడు | TTE 'throws passenger' out of running train | Sakshi
Sakshi News home page

గొడవ పడ్డాడని రైల్లోంచి గెంటేశాడు

Published Mon, May 1 2017 2:20 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

TTE 'throws passenger' out of running train

కడప: తనతో వాదులాడుతున్నాడన్న కోపంతో కదులుతున్న రైల్లోంచి ఓ ప్రయాణికుడిని టీటీఈ నెట్టేశాడు. ఈ ఘటన వైఎస్సార్‌ కడపజిల్లాలో చోటుచేసుకుంది. గిరిప్రసాద్ అనే వ్యక్తి సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో తిరుపతి-కొల్హాపూర్‌ మధ్య నడిచే హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. తిరుపతిలోనే టీటీతో గొడవ జరిగింది. రైలులో కూడా ఇద్దరూ గొడవపడ్డారు.

ఆగ్రహం పట్టలేక ముద్దనూరు మండలం ఓబులాపురం దగ్గర చేరుకోగానే గిరిప్రసాద్‌ను కదులుతున్న రైలునుంచి టీటీ నెట్టేవేశాడు. దీంతో గిరిప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. టీటీ వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement