రైతులను నట్టేట ముంచుతున్నారు | water release issue at irrigation office | Sakshi
Sakshi News home page

రైతులను నట్టేట ముంచుతున్నారు

Published Tue, Aug 23 2016 9:54 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

రైతులను నట్టేట ముంచుతున్నారు - Sakshi

రైతులను నట్టేట ముంచుతున్నారు

  • పుష్కరకు వెంటనే నీరివ్వాలి
  • 27లోగా వదలకుంటే ఉద్యమమే
  • వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి
  • ధవళేశ్వరం ఇరిగేషన్‌కార్యాలయం వద్ద నిరసన
  •  
    ధవళేశ్వరం : 
    ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని వైఎస్సార్‌ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. పుష్కర కాలువకు నీరు ఇవ్వకపోవడంతో దోసకాయలపల్లి, నందరాడ, మధురపూడి, బూరుగుపూడి, బుచ్చింపేట,
    గుమ్ములూరు, కలవచర్ల లిఫ్ట్‌ పరిధిలోని నరసాపురం, గాదరాడ తదితర గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయా గ్రామాల రైతులతో ధవళేశ్వరం ఇరిగేషన్‌ కార్యాలయానికి వచ్చి సమస్యలు పరిష్కరించకుంటే కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగుతానని అధికారులను హెచ్చరించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఎస్‌ఈ సుగుణాకరరావు పుష్కర విధులకు వెళ్లడంతో ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఇ రాంబాబును రాజమహేంద్రవరం రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాలరావు తదితరులతో పాటు ఆమె కలసి మాట్లాడారు. పుష్కర కాలువ పూడికతీత పనులు ముందుకు సాగకుండా ఇరిగేషన్‌ అధికారులు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. పుష్కర ఈఈ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని ఆందోళన నిర్వహించారు. అనంతరం పుష్కర ఇఇ వాసుదేవ్‌ వచ్చి ఈ నెల 27 నాటికి నీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో వైఎస్సార్‌ సీపీ నేతలు ఆందోళన విరమించారు. ఆ నాటికి నీరు ఇవ్వకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, కనీసం సుమారు రూ.3లక్షల విలువైన పూడికతీత  పనులను కూడా చేయకపోవడం దారుణమని జక్కంపూడి అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్న సీఎం చంద్రబాబు నేడు రైతులచేత కూడా సాగు దండగ అనిపించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రైతులకు నీరు ఇవ్వకుండా, రుణమాఫీ అమలు చేయకుండా వారికి నష్టం కలిగిసున్నారన్నారు. పంట విరామం ప్రకటిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ప్రభుత్వం వారి అవసరాలు తీర్చే ఏర్పాటు చేయడం లేదని ఆమె విమర్శించారు. ఏటా ఇలాగే వ్యవహరిస్తున్నారని పంటకు ముందే నిర్వహణ పనులు చేపట్టాలని సూచించారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పుష్కర కాలువకు నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరుకొండ మండల కన్వీనర్‌ ఉల్లి బుజ్జిబాబు, రాజానగరం మండల కన్వీనర్‌ మందారపు వీర్రాజు, డీసీసీబీ మాజీ వైస్‌ చైర్మన్‌ బొల్లిన సుధాకర్‌ నాయకులు పడాల చినబాబు, కర్రి నాగేశ్వరరావు, తోరాటి శ్రీనివాస్, అడపా శ్రీను, మట్టా వెంకటేశులు, కల్యాణం చిట్టిబాబు, పాలెం నాగవిష్ణు, యర్రంశెట్టి పోలారావు, మద్దాల అను, పెన్నాడ జయప్రసాద్, గరగ శ్రీనివాసరావు, ఏజీఆర్‌ నాయుడు, గపూర్‌ తదితరులు పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement