మహిళలకేదీ ప్రాధాన్యం?
► మహిళా సాధికారతను విస్మరించిన కేసీఆర్ సర్కారు
►ఎన్నికల హామీల అమలులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలం
► వైఎస్సార్ పథకాలకు పేరు మారిస్తే ప్రజలు మర్చిపోతారా..?
► మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె.అమృతసాగర్
కరీంనగర్ సిటీ: సీఎం కేసీఆర్ సర్కారులో మహిళలకు ప్రాధాన్యం లేదని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు కె.అమృతసాగర్ విమర్శించారు. మహిళా సాధికారత అంటే కేసీఆర్ కూతురు కవిత మాత్రమేనా అని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆరుగురు మహిళా మంత్రులకు చోటు కల్పించడమే కాకుండా.. దేశంలోనే మొదటిసారిగా ఓ మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. మహిళా పక్షపాతిగా మహిళల పేరిట ఇందిరమ్మ ఇళ్లు, మహిళలను లక్షాధికారులను చేయాలనే ధ్యేయంతో పావలావడ్డీ రుణాలు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
తెలంగాణలో ఏదో జరుగుతుందని ఆశపడి టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే ఈ రెండున్నరేళ్ల కాలంలో ఒరిగిందేమీ లేదన్నారు. బడుగుల కోసం వైఎస్సార్ ఫీజు రీరుుంబర్స్‌మెంట్ ప్రవేశపెట్టి విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తే... నేడు కేసీఆర్ సర్కారు విద్యార్థులను రోడ్లపైకి ఈడ్చిందని, అందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి పథకం ఆచరణలో విఫలమరుు్యందని, పెండ్లి పత్రికలు, దరఖాస్తులతో కార్యాలయాల చుట్టూ తిరగడానికే పరిమితమరుు్యందని అన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు పేరు మార్చినా లబ్ధి చేకూర్చడం లేదన్నారు. పేరు మారిస్తే వైఎస్సార్‌ను మర్చిపోరని, ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లోనే ఉంటారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా వైఎస్సార్‌సీపీ ఎదుగుతుందని, అందుకు ప్రతి కార్యకర్తలు ఐక్యతతో పార్టీని బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
బంగారంపై ఆంక్షలు అర్థరహితం
బంగారంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం అర్థరహితమని అమృతసాగర్ అన్నారు. భారతీయ మహిళలు అత్యంత ఇష్టపడే బంగారంపై పరిమితులు విధించడం తగదన్నారు. మహిళలకు తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద ఎన్నోసార్లు బంగారాన్ని కానుకలుగా ఇస్తారన్నారు. బంగారంపై ఆంక్షలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేస్తామని అన్నారు.
వైఎస్సార్ పాలన స్వర్ణయుగం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ మాట్లాడుతూ వైఎస్సార్ పాలన స్వర్ణయుగమని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో కేసీఆర్ డబుల్‌బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూపంపిణీ వంటి ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు గ్రామాలను మినహా మరెక్కడా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు పునాదులు పడలేదన్నారు. సీఎం మాత్రం రూ.40 కోట్ల ప్రజాధనంతో రాజభవనం నిర్మించుకున్నారని విమర్శించారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుతున్న టీఆర్‌ఎస్ సర్కారు విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని కార్యకర్తలను కోరారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాల బోగె పద్మ మాట్లాడుతూ ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ మహిళలకు ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసమే వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై మహిళలను చైతన్యవంతం చేస్తామన్నారు.
ఇందిరమ్మ బిల్లుల కోసం ధర్నా
జిల్లాలో వివిధ దశల్లో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మీర్ నేహ, సంయుక్త కార్యదర్శి రాగ సంధ్య, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కీసర సాగర్, వరాల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, జిల్లా యూత్ ప్రెసిడెంట్ బండి వెంకట రమణారెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండమీద అంజయ్య, నగర అధ్యక్షుడు సాన రాజన్న, తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రేషవేణి వేణుయాదవ్, రాష్ట్ర యూత్ సెక్రటరీ దుబ్బాక సంపత్, నాయకులు సాదిక్ బలాలా, ఎస్‌కే.జావీద్, వరాల అనిల్, కట్టెకోల యాదగిరి, ఎండీ.రహీం పాల్గొన్నారు.