సంగారెడ్డిజోన్:జిల్లాలోని మీ సేవ కేంద్రాలకు అవార్డులు వచ్చాయి. తెలంగాణా రాష్రంలో మీ–సేవ కేంద్రాల ద్వారా రూ.ఏడుకోట్లు లావాదేవీలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో సమాచార సాంకేతిక శాఖామాత్యులు తారక రామారావు ఆధ్వర్యంలో అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో జిల్లాకు 4 అవార్డులు కైవసం చేసుకున్నాయి.
కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామానికి చెందిన గైని అరుణ దరఖాస్తుతో ఏడు కోట్లు మీ–సేవ దరఖాస్తులు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా గైని అరుణను, మీ–సేవ నిర్వాహకుడుగా దుబ్బాకకు చెందిన శ్రీకష్ణ కుమార్‌ను, అత్యధిక లావాదేవీలు నిర్వహించిన దుద్దెడకు చెందిన పల్లె సమాఖ్య నిర్వహకురాలు సంతోషి, జిల్లా మేనేజర్ వై.శివప్రసాద్‌లను మంత్రి సన్మానించారు.