అమృత్‌సర్: ప్రధానమంత్రి వ్యవహరించాల్సింది లీడర్‌లా తప్ప.. రీడర్‌గా కాదని బీజేపీ నేత అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. మన్మోహన్‌సింగ్ బలహీన ప్రధాన మంత్రేమీ కాదని, ఆయన హయాంలో జరిగిన అభివృద్ధే అందుకు సాక్ష్యమని, అలాగే ఆయన మౌనంగా ఉంటారనడం సరికాదని, వివిధ అంశాలపై విస్తృతంగా మాట్లాడారని ప్రధానమంత్రి సమాచార సలహాదారు పంకజ్ పచౌరి పేర్కొనడంపై జైట్లీ తన బ్లాగ్ ద్వారా శనివారం ధ్వజమెత్తారు.
ప్రధానమంత్రి తన పదేళ్ల పాలనలో తనదైన ముద్రను వేయలేకపోయారని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి మంచు మీద నడిచినా పాదముద్రలు పడకపోవడం మన్మోహన్‌కే చెల్లిందని జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రధాని చేసే ప్రసంగాలను దేశంలో ప్రజలెవరూ వినడం లేదని, పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రధానమంత్రి లీడర్)లా వ్యవహరించాలి తప్ప.. రీడర్‌లా కాదని ఆయన ఈ సందర్భంగా చురకేశారు.
ప్రధాని రీడర్‌లా కాదు.. లీడర్‌లా ఉండాలి: జైట్లీ
Published Sun, Apr 20 2014 3:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement