ఎందుకంత వైరాగ్యం!
ఫిల్మీ దునియాలో రొమాంటిక్ రిలేషన్ కామనైపోయింది. బ్యాచిలర్ స్టార్స్‌ను ఎవర్ని కదిలించినా ఎవరో ఒకరితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న న్యూసే ఈ మధ్య! కానీ.. బెంగాలీ భామ పవోలీదమ్ మాత్రం... ‘మీరు నిజంగా ఒంటరేనా’ అంటే.. భిన్నంగా స్పందించింది. ‘నమ్మినా నమ్మకపోయినా నేనెప్పుడూ ఒంటరిగా ఫీలవ్వనే లేదని’ సెలవిచ్చింది.
గ్లామర్ ప్రపంచంలో ఉంటూ.. ప్రత్యేక ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తూ.. చుట్టూ ఎవరూ లేకుండా జీవితాన్ని ఎలా వెళ్లదీస్తున్నారంటే.. ‘అలాంటి బాధేమీ లేదు’ అంటోంది. ‘సినిమాలు చూస్తా. మ్యూజిక్ వింటా. కానీ.. ఇండస్ట్రీలో వ్యక్తులతో మాత్రం చాలా తక్కువ కలుస్తా. నా ముందున్నది రెండు రకాల ప్రపంచమే. ఒకటి కెమెరా ముందు. రెండోది నాలుగు గోడల మధ్య’ అందీ సుందరి.