‘‘ఇగో లచ్చయ్యా... నిజం చెప్పకపోతే మంచిగుండదు.. ఏమనుకుంటున్నవో?’’ బెదిరించాడు ప్రశాంత్.
‘‘ఏందీ... వేలు చూపిస్తే భయపడ్తమా? అసలు మా పోరడ్ని మీరంత గల్సి ఏం జేసిండ్రో చెప్పుండ్రి ముందుగల్ల...?’’ లచ్చయ్యను పక్కకు తప్పిస్తూ ప్రశాంత్‌ను నిలదీసింది సత్తెమ్మ.
‘‘ఆడిమనిషిని ముందుకువెట్టి ఉల్టా దబాయిస్తే అసలు సంగతి పక్కకువోతదనుకోకు లచ్చయ్యా..! చూస్కంట.. ఎట్ల కక్కియ్యాల్నో చూస్త..’’ అనుకుంటూ వెనక్కి వెళ్లిపోతున్న ప్రశాంత్‌ను..
‘‘ఆ.. చూస్కపో.. మేం కూడా బయటవెస్తం మా పోరడ్ని ఏం జేష్నవో అని’’ ఉక్రోషంతో అరుస్తూ గుమ్మం బయటకు వచ్చింది సత్తెమ్మ.
ఆ రాత్రి చీకట్లో అతను కనిపించకుండా వెళ్లేవరకు ఆగి.. లోపలికి వచ్చి భర్తను పట్టుకొని బోరున ఏడ్చేసింది లచ్చవ్వ...‘‘ఏం పాపం జేసినమంటవ్ మనం? అత్తగారి మాటలిని పెద్దోడు అట్ల కాకుంటవాయె.. షిన్నోడింత షెయ్‌కొచ్చే అని అనుకునేటాల్లకు ఈడిట్లయిపాయే.. ఏం బతుకుది.. మనకే ఎందుకిట్లయితాంది?’’ అంటూ!
భార్యను ఓదారుస్తూనే ‘‘పోరడేమైమాపాయెనే’’అనుకుంటూ కలవరపడ్డాడు లచ్చయ్య. ‘‘బాపూ.. అనిల్‌గాడు మస్కట్‌ల పనిదొర్కతదన్నడు.. పోతనే’’ అని పట్టుబట్టిండు. మెట్‌పల్లిల ఆడంతటల ఆడే డ్రైవింగ్ నేర్సుకున్నడు.. అనిల్‌ని వట్టుకొని లైసెన్స్ తెచ్చుకున్నడు.. ఇగో.. ప్రశాంత్ తాన్నే మస్కట్ వీసాకి పైసలు గట్టిండు.. మొస్సమర్లకుండ జేసుకున్నడు ఇవన్నీ. ఆడ కంపెనీల పనిదొరికి వీసా అచ్చినరోజు పోరడి సంతోషం జూడాల.. షిన్నసన్న సంతోషం గాదు.. ‘‘బాపూ.. నువ్వేం రందివెట్టుకోకు.. మంచి జీతమే ఉందే.. పైసలు వంపిస్తా.. అమ్మ పైలం. నువ్వు సుత ఏం కష్టపడకు’’ అని చెప్పి పోయిండు అని గుర్తు చేసుకున్న లచ్చయ్య.. మళ్లీ వెంటనే ‘‘సత్తి.. పోరడేమైపాయెనే’’ అంటూ మెలకువలోనే కలవరించినట్టు అడిగాడు. భర్త తీరులో ఏదో తేడా అనిపించి ఆయన గుండెలో తలదాచుకొని ఏడుస్తున్నదల్లా ఒక్కసారిగా తలపైకెత్తి లచ్చయ్య మొహంలోకి చూసింది. అతని చూపులు ఎక్కడో ఉన్నాయి.. నిమిష నిమిషానికి అదే మాట.. ‘‘పోరడేమైపాయెనే..’’అంటూ!
‘‘ఓరి భగవంతుడా.. మల్లా ఏం కష్టం దెచ్చినవురా.. ’’ అనుకుంటూ రెండు చేతులతో తలకొట్టుకుంటూ మొత్తుకోవడం మొదలుపెట్టింది.
‘‘ అన్నా.. ఇప్పటికిప్పుడు లక్షన్నర కట్టమంటే ఎట్లా కడ్తాన్నా..’’ బతిమాలుతున్నడు ప్రశాంత్.
‘‘ఏం మజాక్ జేస్తున్నవా? బొంబై జగదీష్ అటే ఏమనుకున్నవ్ బే? బొక్కలు తెల్లగ జేస్తబిడ్డా!’’ ప్రశాంత్ కాలర్ పట్టుకొని కళ్లెర్ర జేస్తూ జగదీష్.
‘‘ నిజంగనే నాకు దెల్వదు అన్నా.. కాలర్ ఇడ్షిపెట్టన్నా.. ఎవరన్నొస్తే ఇజ్జత్ వోతది ప్లీ...’’ ప్రశాంత్ విన్నపం పూర్తికాకుండానే ‘‘ గీ ఊర్లె.. ముత్తెమంత ఆఫీస్‌కే నీకు ఇజ్జత్ ఉంటే బొంబైల రిజిష్టర్ ఏజెన్సీ బే నాది.. నాకెంతుండాలే? మస్కట్ సేuŠ‡ .. నా షెవులు విండి పైసలు వసూలు జేస్కున్నడు.. నువ్వు వంపిన పిల్లగాడు ఎయిర్‌పోర్ట్ నుంచి పారిపోయిండు అని. ఆ పైసలు ఎవడిస్తడు.. నీ అయ్యనా.. తాతనా? ఇజ్జతట ఇజ్జత్’’ అంటూ విసురుగా ప్రశాంత్ చొక్కా కాలర్ వదిలేశాడు జగదీష్. ఆ విసురుకి వెళ్లి అక్కడే ఉన్న గోడకు కొట్టుకున్నాడు ప్రశాంత్. అతను సర్దుకొని లేచేలోపే ఆఫీస్ టేబుల్ సొరుగు తెరిచాడు జగదీష్.
అది చూసి కంగారు పడుతూ ‘‘అవి ఇంకో పిల్లగాని వీసా పైసలన్నా.. ప్లీజ్.. వారం రోజులు టైమ్ ఇయ్యి. నిన్ననే పోరడోల్ల ఇంటికి వొయ్యి ఆల్ల అవ్వ, బాపుని అడిగిన, రేపు అల్ల అన్ననీ అడిగి ఎట్లనన్న పైసలిప్పిస్త.. ప్లీజ్..’’ అంటూ సొరుగులోంచి డబ్బులు తీస్తున్న జగదీష్‌ను అడ్డుకోబోయాడు ప్రశాంత్.
చేతికందిన డబ్బును వెంటనే ప్యాంట్ జేబులో కుక్కుకుంటూ అడ్డొచ్చిన ప్రశాంత్‌ను.. ‘‘చల్ బే..’’అని పక్కకు తోసేసి వెళ్లిపోయాడు జగదీష్.
‘‘సత్తెమ్మా.. మీ పిల్లగాడు మస్కట్‌కు వొయిండు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌ల దిగిండు. అక్కడిదాకైతే సంగతి తెల్సింది. ఆడ్నుంచి ఏడికి వోయిండు అనేదే తెలుస్తలేదు మరి’’ ఎస్‌ఐ చెప్పాడు.
‘‘ఆడిదాంక వొయినోడు ఏడికి వోతడు సారూ..’’ ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన కళ్లల్లో దిగులు, తడారిపోయి ఆందోళన చేరిన గొంతుతో సత్తెమ్మ.
‘‘ఇంకేంది.. పనిచూపిచ్చిన సేuŠ‡కు చెట్టాగొట్టి.. ఇంకేండికో చెక్కేసిండు’’ కసి తీర్చుకుంటూ ప్రశాంత్.
‘‘ఏయ్ ఛుప్ ’’ టేబుల్ మీద చరుస్తూ ప్రశాంత్‌ను గద్దించాడు ఎస్‌ఐ.
‘‘ అట్ల పొయ్యేంత తెలివిగల్లోడుకాదు సార్.. మా పోరడు’’ దీనంగా సత్తెమ్మ.
‘‘అనిల్ తప్ప ఆడెవరన్నా దోస్తులున్నట్టు... ఆడిక్కూడా కూడా పోతా అన్నట్టు ఏమన్నా చెప్పిండా మీ పొల్లగాడు?’’ ఆరా తీసే ప్రయత్నంలో ఎస్‌ఐ.
తల అడ్డంగా ఊపుతూ ‘‘నువ్వే అనిల్‌కి ఫోన్ చేస్తివి గదా సారూ.. ఓల్లు తెల్వదు ఈడ ఆడికి.. అని అనిల్ కూడా చెప్పే కదా..’’ వివరణ ఇచ్చింది సత్తెమ్మ.
రాత్రి పదకొండు...
సత్తెమ్మకు నిద్ర పట్టట్లేదు. ఇంట్లోకి వాకిట్లోకి తిరుగుతోంది. ఎప్పట్లా లచ్చయ్య కలత నిద్రలో ఉన్నాడు. సెల్‌ఫోన్ మోగింది. పట్టించుకోకుండా నిరాసక్తంగా.. నిర్లిప్తంగా మంచినీళ్ల కుండ దగ్గరకు వెళ్లి.. నీళ్లు తాగింది సత్తెమ్మ. ఆగి పోయి మళ్లీ మోగడం మొదలుపెట్టింది ఫోన్. ‘‘పోలీస్ కంప్లయింట్ ఇచ్చినా ఈ ప్రశాంత్ గాడికి సోయిరాలే.. అద్దెమ్మరాత్తిర్కీ ఫోన్ చేసి సతాయిస్తుండు’’ అని సణుక్కుంటూ ఫోన్ కట్ చేయబోయింది.. కొత్త నంబర్ కనపడింది. ఆత్రంగా లిఫ్ట్ చేసింది.. ‘‘
‘‘హలో...’’
‘‘హలో... అమ్మా..’’ అన్న ఆ గొంతు విన్న సత్తెమ్మకు దుఃఖం ఆగలేదు.
‘‘ఒరేయ్ .. పోరడా .. ఏడికి వొయినవ్‌రా..’’ మాటను ఏడుపు అడ్డుకుంటూండగా అడిగింది కొడుకును.
ఆ పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఎంతోసేపటికి తనను తాను నిభాయించుకుని జరిగింది చెప్పాడు.
అతను మస్కట్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసుకొని బయటకు వచ్చాడు. తనను పికప్ చేసుకునే ఏజెంట్ ఉండమన్న చోటే నిలబడ్డాడు. ఎవరో ఒకతను తననే చూస్తూ గమనిస్తూ కనిపించేసరికి అతనే తనను పికప్ చేసుకునే వ్యక్తి అనుకొని వెళ్లాడు. ఆ వ్యక్తీ ఈ అబ్బాయిని చూసి ఎదురొచ్చాడు. విష్ చేసి. ఈ అబ్బాయి బ్యాగ్ తీసుకొని గబగబా ముందుకు నడిచి.. వెహికిల్లో పెట్టాడు. అతనే ఏజెంట్ అనే నమ్మకం రూఢీ అయిపోయింది అబ్బాయికి. వెహికిల్‌లో కూర్చున్నాడు. చాలా దూరం ఎడారి గుండా ప్రయాణం చేయించి ఓ చోట దింపాడు. పాకలాంటిది ఉంది అక్కడ. ఒంటెలున్నాయి. వాటిని చూసుకోవడమే పని అన్నాడు. కాని ఆ అబ్బాయికి దొరికిన ఉద్యోగమేమో డ్రైవర్‌గా. ఏమీ అర్థంకాలేదు. అదే అడిగాడు వచ్చీరాని హిందీలో ఆ వ్యక్తిని. సమాధానంగా ఆ వ్యక్తి.. అబ్బాయిని కొట్టాడు. తర్వాత అర్థమైంది ఆ పిల్లాడికి.. కిడ్నాప్ అయ్యానని.
కిడ్నాప్
Published Sun, Dec 8 2019 3:06 AM | Last Updated on Sun, Dec 8 2019 3:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment