నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ | cm kcr to meet pm modi in delhi tomarrow | Sakshi
Sakshi News home page

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

Published Thu, Feb 11 2016 7:39 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ - Sakshi

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు(శుక్రవారం) మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో కేసీఆర్ భేటీ కానున్నారు. 13న కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలతో సమావేశం కానున్నారు. తెలంగాణకు రావల్సిన కేంద్ర నిధులపై ముఖ్యంగా చర్చించనున్నారు. రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రావాల్సిన బకాయిలు, ఆర్థిక సాయం తదితర అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు. గురువారం జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అనంతరం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement