వైఎస్ఆర్ సీపీ నేతలకు వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్ఆర్ సీపీ నేతలకు వైఎస్ జగన్ పరామర్శ
Published Thu, Jan 21 2016 12:39 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వం అక్రమల కేసుల్లో ఇరికించిన ఫలితంగా నెల్లూరు జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిధున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేత మధుసూదన్ రెడ్డిలను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు.
గత నవంబర్ 26వ తేదీన రేణిగుంట విమానాశ్రయ అధికారిని ప్రయాణికుల తరపున ప్రశ్నించినందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంపీ మిథున్‌రెడ్డిపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసులో రైల్వే పోలీసులు మంగళవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.
వైఎస్ జగన్ ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతికి చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన నేరుగా నెల్లూరు కేంద్ర జైలుకు వెళ్లి ఈ ముగ్గురు నాయకులను కలిసి పరామర్శించారు. జగన్ వెంట జ్యోతుల నెహ్రో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్, అనిల్ కుమార్ యాదవ్, పలువురు జిల్లా నాయకులు ఉన్నారు.
Advertisement
Advertisement