ప్రజల కష్టాలకు మోదీ జవాబు చెప్పాలి:చాడ | chada about notes cancellation | Sakshi
Sakshi News home page

ప్రజల కష్టాలకు మోదీ జవాబు చెప్పాలి:చాడ

Published Sun, Dec 4 2016 3:20 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

ప్రజల కష్టాలకు మోదీ జవాబు చెప్పాలి:చాడ - Sakshi

ప్రజల కష్టాలకు మోదీ జవాబు చెప్పాలి:చాడ

సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలకు ప్రధాని మోదీ సమా ధానం చెప్పాలని, అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గత 70 ఏళ్లలో ప్రజలు ఎన్నడూ ఇంతటి మన స్తాపం చెందలేదని ఆయన శనివారం అన్నారు. పెద్దనోట్ల రద్దు పేదలకు శాపమైందన్నారు. నిత్యావసర వస్తువులు కూడా కొనలేని స్థితిలో సామాన్యులు ఉన్నారన్నారు. కావల్సినన్ని చిన్ననోట్లను ముద్రించ కుండా పెద్దనోట్లను రద్దు చేయడం ప్రధాని అనాలోచిత విధానాలకు అద్దం పడుతోందన్నారు. చాయ్‌వాలాగా ప్రచారం చేసుకునే మోదీ.. చిన్న దుకాణాలు, బడ్డీకోట్లు, చాయ్ దుకాణాలు చిల్లరపైనే ఆధారపడతాయన్న విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement