![సీఎంది నియంతృత్వ పాలన - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/17/61502922308_625x300.jpg.webp?itok=4jR2QGcH)
సీఎంది నియంతృత్వ పాలన
చాడ
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, కోరికలు నెరవేరడం లేదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. అసలు టీఆర్‌ఎస్ పాలన సచివాలయం నుంచి జరగడం లేదని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంను కలిసే పరిస్థితి లేదని, అందుకే ప్రజలు ప్రగతిభవన్ వద్దకే వెళ్లి నిరసన తెలుపుతున్నారన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో ధర్నాలను కూడా నిషేధించారని చాడ ఆరోపించారు.