శంషాబాద్ (రంగారెడ్డి) : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం తనిఖీలు చేపడుతున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 876 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తి హైదరాబాద్‌కు చెందినవాడిగా గుర్తించిన పోలీసులు అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు.