సురక్షితమైన నగరం హైదరాబాద్‌ | Hyderabad is a safe city | Sakshi
Sakshi News home page

సురక్షితమైన నగరం హైదరాబాద్‌

Published Fri, Mar 3 2017 11:27 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

సురక్షితమైన నగరం హైదరాబాద్‌ - Sakshi

సురక్షితమైన నగరం హైదరాబాద్‌

రాంగోపాల్‌పేట్‌:  హైదరాబాద్‌ మహిళలు, పిల్లలకు ఎంతో సురక్షితమైన నగరమని అదనపు కమిషనర్‌ (క్రైమ్‌ అండ్‌ షీ టీమ్స్‌) స్వాతి లక్రా అన్నారు.  ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించనున్న 5కే రన్, 2కే రన్‌ విజయవంతం చేయాలని కోరుతూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం కర్టన్‌ రైజర్‌లో భాగంగా ప్లాష్‌ మాబ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షీ టీమ్స్‌ ఏర్పాటు చేయడం వల్ల మహిళల్లో భరోసా పెరిగిందన్నారు. వారి కోసం భరోసా, వికల్ప కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

యువతులు, మహిళల పట్ల సోషల్‌ మీడియా వేధికగా వేధింపులు పెరుగుతున్నాయని వాటిని నివారించేందుకు  అంతర్జాతీయ ప్రమాణాలతో సైబర్‌ క్రైమ్స్‌ ఏర్పాటు చేసినట్లు  చెప్పారు. కేవలం 15శాతం మంది మాత్రమే మహిళలు, యువతుల పట్ల వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు మంచి సమాజం నిర్మాణం కోసం సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ నెల 8న నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించనున్న 5కే, 2కే రన్‌లను విజయవంతం చేయాలన్నారు. ఉత్తర మండలం డీసీపీ సుమతి మాట్లాడుతూ ప్రపంచంలో మహిళలు, పిల్లల అక్రమ రవాణా   సమస్యగా మారిందన్నారు. ఈ సందర్భం గా యువతీ, యువకులు ప్రదర్శించిన ప్లాష్‌ మాబ్‌ అందరిని ఆకట్టుకుంది.

ప్లాష్‌ మాబ్‌లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement