కోరిక తీర్చకపోతే పరువు తీస్తా !
కోరిక తీర్చకపోతే పరువు తీస్తా !
Published Sat, Feb 25 2017 8:45 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM
► యువకుడి వేధింపులు
► మనస్తాపంతో యువతి ఆత్మహత్య
మైసూరు: రాష్ట్రంలో మహిళలు, యువతులపై లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. తనతో శృంగారంలో పాల్గొనాలని అందుకు అంగీకరించకపోతే తల్లికి చెందిన అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్ చేస్తానంటూ యువకుడు బెదిరించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శుక్రవారం జిల్లాలోని బన్నూరులో జరిగింది.
బన్నూరు పరిధిలోని తురుగనూరు గ్రామానికి చెందిన చైత్ర (20) తండ్రి కొద్ది కాలం క్రితం మరణించడంతో తన తల్లితో కలసి గ్రామంలోని ఓ ఆశ్రమంలో ఉంటూ మండ్య ప్రభుత్వ కాలేజీలో బీఎస్సీ చదువుతోంది. చైత్ర కుటుంబ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ రవి అనే యువకుడు చైత్రపై కన్నేసాడు.
ఈ క్రమంలో తన వద్ద ఆమె తల్లికి చెందిన అశ్లీల వీడియోలు ఉన్నాయని వాటని డిలీట్ చేయాలంటే తనకు రూ.లక్ష నగదు ఇవ్వాలని లేదా తనతో శృంగారంలో పాల్గొనాలంటూ చైత్రను వేధించడం ప్రారంభించాడు. అందుకు అంగీకరించకపోతే ఆమె తల్లికి చెందిన అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ చైత్రను బెదిరించేవాడు. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 21న చైత్ర చదువుతున్న కాలేజీకి వెళ్లిన ట్రాక్టర్ రవి తను చెప్పినట్లు వినకపోతే నీ గురించి కాలేజీలో తప్పుగా ప్రచారం చేస్తానంటూ బెదిరించాడు. రవి వేధింపులు తాళలేక చైత్ర శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవి కోసం గాలిస్తున్నారు.
Advertisement
Advertisement