'టీటీడీపీని చంద్రబాబే లెక్కలోకి తీసుకోవడం లేదు' | k Taraka rama rao comments on ttdp | Sakshi
Sakshi News home page

'టీటీడీపీని చంద్రబాబే లెక్కలోకి తీసుకోవడం లేదు'

Published Fri, Jan 1 2016 7:16 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'టీటీడీపీని చంద్రబాబే లెక్కలోకి తీసుకోవడం లేదు' - Sakshi

'టీటీడీపీని చంద్రబాబే లెక్కలోకి తీసుకోవడం లేదు'

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని రాష్ట్ర ఐటి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ టీడీపీని స్వయానా చంద్రబాబే లెక్కలోకి తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో సీమాంద్రులు టీఆర్ఎస్ను నమ్మకపోవడం మూలంగానే ఇక్కడ ఆశించిన స్థాయిలో టీఆర్ఎస్ విజయం సాధించలేదని, అయితే ఇప్పుడు హైదరాబాద్ రాజకీయ పరిస్థితులు మారాయన్నారు.

గ్రేటర్లో కాంగ్రెస్కు 10 సీట్లకు మించి రావని, టీఆర్ఎస్ 80 సీట్లు గెలుస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిందేమీ లేదన్న ఆయన రాష్ట్రానికి రమ్మని పిలిచినా కూడా కేంద్రమంత్రులు రావడం లేదని విమర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement