సాక్షి, హైదరాబాద్ : బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఇకపై నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా బీసీ నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే నోటిఫికేషన్ల కోసం వేచి చూడకుండా ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆయా పోటీ పరీక్షలు వచ్చినప్పుడల్లా శిక్షణకు సీబీసీడబ్ల్యూ నుంచి అనుమతి తీసుకునేలా ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాన్ని కూడా నిలిపేసినట్లు పేర్కొంది. నోటిఫికేషన్లు వెలువడిన తరువాత శిక్షణ ప్రారంభిస్తే సమయాభావం కారణంగా బీసీలకు సకాలంలో శిక్షణ అందుబాటులోకి రావడం లేదని అభిప్రాయపడింది.
దీనికి బదులు జిల్లాల్లోని బీసీల జనాభాకు అనుగుణంగా కలెక్టర్లకు బడ్జెట్‌ను కేటాయించి, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకునేలా ప్రభుత్వం మార్పు చేసింది. ఈ విధానం ఇప్పటి వరకు అందుబాటులో లేనందున తెలంగాణ బీసీ స్టడీసర్కిళ్ల కోసం విడిగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని సీజీజీ డెరైక్టర్ జనరల్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా శిక్షణ
Published Sun, Sep 6 2015 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement