అద్దెకు ‘ఆర్టీసీ’ | RTC to Rent | Sakshi
Sakshi News home page

అద్దెకు ‘ఆర్టీసీ’

Published Wed, Nov 9 2016 3:48 AM | Last Updated on Tue, Oct 2 2018 3:08 PM

అద్దెకు ‘ఆర్టీసీ’ - Sakshi

అద్దెకు ‘ఆర్టీసీ’

- 355 బస్‌స్టేషన్ భవనాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయం
- మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టులు, ప్లే జోన్ల నిర్మాణానికి అవకాశం
- 4 వేల ఎకరాల స్థలాలనూ కేటారుుంచే యోచన
- త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన
- సినిమా షూటింగులకు బస్‌భవన్
- వాణిజ్య రూపంలో రూ.300 కోట్ల ఆదాయం పొందే లక్ష్యం
 
 సాక్షి, హైదరాబాద్: రండి బాబు రండి.. సినిమా షూటింగులకు బస్‌భవన్‌ను విని యోగించుకోండి.. అన్ని వసతులూ ఉన్నాయ్, మీకు నచ్చిన బస్టాండ్లపైన సినిమా థియేటర్లు ఏర్పాటు చేసుకోండి.. రెస్టారెంట్లు, ప్లేజోన్‌లైనా ఫర్వాలేదు.. అంటూ ఆర్టీసీ ఆహ్వానిస్తోంది. దీనికి స్పందించి బస్‌భవన్‌లో సినిమా సందడి నెలకొంది. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ మొద లు కాగా మరిన్ని సినిమా యూనిట్లు సంప్ర దిస్తు న్నారుు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 355 బస్టాండ్లపై మిని థియేటర్లు, ఇతర వాణి జ్య వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు సంస్థలను ఆహ్వానిస్తూ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వెరసి ప్రస్తుతం టికెట్ల ద్వారా కాకుండా వాణిజ్య పరమైన మార్గాల ద్వారా వస్తున్న రూ.70 కోట్ల వార్షికాదాయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి  300కోట్లకు చేరాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.

 నిబంధనల సడలింపు...
 తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల ఎకరాల ఖాళీ భూములున్నారుు. వీటిని పెట్టుబడిగా చేసి భారీ ఆదాయాన్ని పొందాలని సంస్థ నిర్ణరుుంచింది. వీటిని లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం గతంలో కూడా జరిగినా నిబంధనలు కఠినంగా ఉండటం తో చాలా సంస్థలు వెనకడుగు వేశారుు. ఇప్పుడు ఆ నిబంధనలను సరళతరం చేయటం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించాలని నిర్ణరుుంచారు. ముఖ్యంగా లీజు అద్దె, ఇతర ఫీజులను కనీసం 30 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని నిర్ణరుుంచారు. వీటితోపాటు ఆర్టీసీ బస్టాండ్ల భవనాలపైన, వెనకవైపు మినీ థియేటర్లుగా మార్చే ఏర్పాట్లు జరుగుతున్నారుు. నగరంలోని ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్లతో పాటు కోటి, కూకట్‌పల్లి, కాచిగూడల్లోని ఆర్టీసీ స్టేషన్లలో మల్టీప్లెక్స్ లు, ఇతర పట్టణాల్లోని బస్టాండ్లలో ఉన్న వెసులుబాటు ఆధారంగా మల్టీప్లెక్స్‌లు, మినీ థియేటర్లు ఏర్పాటు  చేయాలని నిర్ణరుుంచింది. థియేట ర్లతో పాటు ఫుడ్‌కోర్డులు, ప్లే జోన్లులాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా లీజుకు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ఇవ్వనున్నారు.

 సినిమా షూటింగులకు బస్‌భవన్...
 ఆర్టీసీ ప్రధాన పరిపాలన భవనం బస్‌భవన్ విశాలంగా ఉండటంతో దాన్ని సినిమా షూటింగులకు అద్దెకివ్వాలని నిర్ణరుుంచారు. ఈ మేరకు సినిమా యూనిట్లతో అధికారులు ఇప్పటికే సంప్రదిస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సంస్థ స్పం దించి వారం రోజులుగా షూటింగ్ నిర్వహి స్తోంది. దీంతో మరిన్ని సినిమా సంస్థలు ముందుకొస్తున్నారుు.
 
 అద్దెకు బస్‌భవన్...?
  బస్‌భవన్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ విభాగాలు అమరావతికి తరలిపోతే చాలా ఖాళీ ఏర్పడనుంది. దీంతో భవనంలోని కొంతభాగాన్ని ప్రైవేటు సంస్థలకు అద్దెకివ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. పార్కింగ్ స్థలం విశాలంగా ఉండటంతోపాటు భవనం రాజధాని నడిబొడ్డున ఉండటంతో దానికి మంచి డిమాండ్ ఉంది. ఆ మేరకు పత్రికా ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement