చైనా యువతికి నాలుగు కిడ్నీలు
బీజింగ్: సాధారణంగా ఎవరికైనా రెండే కిడ్నీలుంటాయి. ఒకటి చెడిపోతే మరోదాంతో బతుకుతారు. కాని చైనాలో ఓ యువతికి ఏకంగా నాలుగు కిడ్నీలున్న విషయం ఇటీవలే వెలుగుచూసింది. వెన్నునొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లిన గ్జెలియన్ అనే 17 ఏళ్ల యువతికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడంతో నాలుగు కిడ్నీలున్న విషయం బయటపడింది. అయితే ఇప్పటిదాకా ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ విషయమై డాక్టర్లు మాట్లాడుతూ... కిడ్నీలు రెండుకంటే ఎక్కువ ఉండడాన్ని రెనల్ డూప్లెక్స్ మొన్‌స్ట్రోసిటీ అంటారని, ప్రతి 1500 మందిలో ఒకరికి ఇటువంటి సమస్య ఉంటుందన్నారు. అయితే చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చని, అదనంగా కిడ్నీలు ఉండడంవల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. అయితే వీరికున్న సౌలభ్యం ఏంటంటే... అదనంగా ఉన్న కిడ్నీలను వీరు ఎవరికైనా దానం చేసుకోవచ్చని చెప్పారు.