ట్రంప్ సమాజానికి ప్రమాదకారి: పద్మా లక్ష్మి
థింపూ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సమాజా నికి ప్రమాదకారి’ అని భారతసంతతికి చెందిన టీవీ హోస్ట్, రచయిత పద్మా లక్ష్మి మండిపడ్డారు. ఈ మేరకు ఇక్కడ ఆదివారం నిర్వహించిన ‘మిస్ట్రెస్ ఆప్ స్పైసెస్’ అనే సదస్సుకు ఆమె హాజరయ్యి మాట్లాడారు. ‘ట్రంప్ సమా జానికి ప్రమాదకారిగా నేను భావిస్తున్నాను.
మన దేశంలో అత్యంత పవిత్రమైన అధ్యక్ష పీఠం ట్రంప్‌నకు దక్కకూడదని ఎంతో ప్రయత్నిం చాను. అది జరుగనందుకు క్షమించండి’ అని ఆమె అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా హిల్లరీ క్లింటన్ తరఫున పద్మా లక్ష్మి ప్రచారం నిర్వహించారు.