దొంగే దొంగా దొంగా అని పోలీసులకు ఫోన్ చేస్తే.. | Man Calls Cops After Dad Burns Cannabis | Sakshi
Sakshi News home page

దొంగే దొంగా దొంగా అని పోలీసులకు ఫోన్ చేస్తే..

Published Wed, Jul 6 2016 11:44 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

దొంగే దొంగా దొంగా అని పోలీసులకు ఫోన్ చేస్తే..

దొంగే దొంగా దొంగా అని పోలీసులకు ఫోన్ చేస్తే..

సిడ్నీ: దొంగే దొంగా దొంగా అన్నట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. తమ స్థలంలో పెంచుకుంటున్న గంజాయిని తన తండ్రి తగులబెట్టేశాడని ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి ఓ కుమారుడు చెప్పాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని డార్విన్కు సమీపంలోగల హంప్టీ డూ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్తర్న్ టెర్రిటరీ పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి తన తండ్రితో తాను గొడవ పడ్డానని, అయితే, ఆ క్రమంలో తండ్రి తమ స్థలంలోని గంజాయి మొక్కలు తగులబెట్టాడని చెప్పాడు. అయితే, తాము ఇన్నాళ్లపాటు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగానే ఆ మొక్కలను కాల్చడంతో అది తప్పనుకొని భ్రమపడిన ఆ కుమారుడు పోలీసులకు ఫోన్ చేసి ఈ చర్య గురించి చెప్పాడు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి చూడగా అక్కడ గంజాయి మొక్కలు ఉన్నమాట వాస్తవమే అని తేలింది. ఈ ఘటనకు సంబంధించి తండ్రి, కొడుకులు ఇద్దరు దోషులే అని పోలీసులు అభిప్రాయపడ్డారు. అయితే, ఇంకా కేసు నమోదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement