సియోల్: ఐక్యరాజ్యసమితి(ఐరాస) ఆంక్షలను ఉల్లంఘించి ఉత్తర కొరియాకు ముడిచమురును సరఫరా చేస్తున్న మరో నౌకను దక్షిణ కొరియా అదుపులోకి తీసుకుంది. ద.కొరియాలోని ప్యాంగ్‌టెక్–డాంగ్‌జిన్ పోర్టులోపనామాకు చెందిన 5,100 టన్నులున్న ‘కొటి’నౌకను డిసెంబర్ 21న స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ నౌక ఉ.కొరియాకు చెందిన నౌకకు చమురును బదిలీ చేసిందని పేర్కొన్నారు. ఈ నౌకా సిబ్బందిని పోలీసులు, నిఘా సిబ్బంది ప్రశ్నిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment