యువత ఎక్కడ అత్యధికమో తెలుసా? | the-world-s-10-youngest-countries-are-all-in-africa | Sakshi
Sakshi News home page

యువత ఎక్కడ అత్యధికమో తెలుసా?

Published Fri, May 20 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

యువత ఎక్కడ అత్యధికమో తెలుసా?

యువత ఎక్కడ అత్యధికమో తెలుసా?

యువత ఏ దేశంలో ఎక్కువగా ఉంటే ఆ దేశ అభివృద్ధి బాగుంటుంది. ఆ లెక్కన చూస్తే త్వరలో ఆఫ్రికా బాగా అభివృద్ధి చెందబోతోంది. ఎందుకంటే పౌరుల సగటు వయసు తక్కువగా ఉన్న టాప్ టెన్ దేశాలు ఆఫ్రికాలోనివే. ఈ జాబితాలో నైగర్ తొలి స్థానంలో ఉంది. ఈ దేశ పౌరుల సగటు వయసు 14.8 ఏళ్లు. ఇది ప్రపంచ పౌరుల సగటు వయసు( 29.6) లో సగం కావడం విశేషం. ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. ఇక ఉగాండా 15.9 ఏళ్ల సగటుతో రెండో స్ధానంలో నిలవగా, 16 ఏళ్ల వయసులో చాద్ మూడ్ స్థానంలో ఉంది. నైగర్ లో ప్రతి స్త్రీ సగటున 7.6 మంది పిల్లలను కలిగి ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది ప్రపంచ సగటు (2.5) లో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ.

ఈ దేశ పౌరుల సగటు అయుర్థాయం 58 సంవత్సరాలు  కావడం వల్లే ఇక్కడ పౌరుల సగటు వయసు ఇంత తక్కువగా నమోదైంది. ఆఫ్రికా యువ జనాభాయే ఈ ఖండానికి పెద్ద సానుకూలమైన అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పనిచేసే జనాభా ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థికంగా ఈ ఖండం త్వరలో బాగా బలోపేతం కావడానికి అవకాశాలు ఉన్నాయని అంచనా. 2011, 2030 మధ్యకాలంలో అక్కడి జీడీపీ 11 నుంచి 15 శాతం మేర వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అయితే ఇందుకు తగ్గట్టుగానే ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

ఆఫ్రికా లోని టాప్ 10 దేశాలు :
1. నైగర్ (14.8)
2.ఉగాండా (15.9)
3. చాద్ (16)
4. అంగోళా (16.1)
5. మాలి (16.2)
6. సోమాలి (16.5
7. గాంబియా (16.8)
8. జాంబియా (16.9)
9. డీఆర్సీ (16.9)

10. బుర్కినా ఫాసో (17)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement