1.25 లక్షల ట్విట్టర్ ఎకౌంట్లు సస్పెండ్ | Twitter suspends 125,000 terrorism-related accounts | Sakshi
Sakshi News home page

1.25 లక్షల ట్విట్టర్ ఎకౌంట్లు సస్పెండ్

Published Sat, Feb 6 2016 9:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

1.25 లక్షల ట్విట్టర్ ఎకౌంట్లు సస్పెండ్

1.25 లక్షల ట్విట్టర్ ఎకౌంట్లు సస్పెండ్

శాన్ ఫ్రాన్సిస్కో: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న 1.25 లక్షల ఎకౌంట్లను సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ట్విట్టర్ను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు తమ విధానం అనుమతించందని ఆ సంస్థ ట్వీట్ చేసింది.

2004లో మూణ్నెళ్ల కాలంలో ఐఎస్కు సంబంధించి ట్విట్టర్లో 46 వేల ఎకౌంట్లు ఉన్నాయి. ఆ తర్వాత 2005 నుంచి వీటి సంఖ్య క్రమేణా పెరిగింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా వీటిని గుర్తించి సస్పెండ్ చేశారు. ట్విట్టర్లో ఖాతాదారులు పోస్ట్ చేసే అభ్యంతకర కామెంట్లపై నిశిత పరిశీలన ఉంటుంది. పిల్లల అశ్లీల సాహిత్యం నిరోధించడానికి ఇంతకుముందే ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ట్విట్టర్లో 50 కోట్ల మంది ఖాతాదారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement