మహిళల టాప్ ఐదు భయాలు తెలుసా?
లండన్: గ్లామర్ మీద కామెంట్ చేస్తే మహిళలు అస్సలు తట్టుకోలేరనే విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే. ఈ పని ఎందుకు సరిగా చేయలేదని కసురుకున్నా పెద్దగా పట్టించుకోరేమోగానీ మీరేందుకు ఈ మధ్య ఇలా అవుతున్నారు.. రోజురోజుకు గ్లామర్ తగ్గిపోతుందని కామెంట్ చేస్తే మాత్రం ఇక ఆ రోజంతా మధనపడతారు. ఇక అద్దం ముందు నిల్చుని తమను తాము ఎన్నిసార్లు చూసుకుంటారో చెప్పనక్కర్లేదు. అలాంటి మహిళలకు ఎవరూ ఎలాంటి కామెంట్ చేయకుండానే ఒక రోజుకు సరిగ్గా భయంపట్టుకుందట.
అది కూడా గ్లామర్ భయమే.. అంతకుముందు ఏ ఒక్కసారో రెండుసార్లో తమను తాము చూసుకునే వారు ఆ రోజు వచ్చినప్పటి నుంచి వీలయినన్ని ఎక్కువసార్లు తమ ముఖాన్ని అద్దంలో చూసి సరిచేసుకుంటారంట. అదెప్పుడంటే వారు సరిగ్గా 29 ఏటకు అడుగుపెట్టినప్పుడు. అవును 2/3వంతు మహిళలకు 29 ఏళ్లలో అడుగుపెట్టి 30వ పుట్టిన రోజు కేక్ను కట్ చేసే సమయంలో ఈ భయంపట్టుకుందట. దీనికి అదనంగా జుట్టురాలిపోవడం, చర్మం ముడతలు పడిపోవడం, కళ్ల వద్ద కాకి పాదాల్లాగా ముడత రావడం వంటి ఆందోళలన చేరుతాయంట.
ఇక పురుషులకయితే ఇలాంటి సమస్య తొందరగా రాదని, 36 ఏళ్ల తర్వాతనే వారికి కొద్దిగా ఆందోళన మొదలవుతుందని ఆ సర్వే తెలిపింది. మాంచెస్టర్లోని క్రౌన్ క్లిన్ అనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ దాదాపు వెయ్యిమందితో ఈ సర్వే చేయించి దాని వివరాలు విడుదల చేసింది. దీనిప్రకారం..
వయసుపైబడుతున్న మహిళలకు ఉండే టాప్ ఐదు భయాలు
1.జుట్టు నెరవడం
2.చర్మం ముడతలు
3.కళ్ల వద్ద కాకి పాదాల్లాంటి ముడతలు
4.డబుల్ చిన్
5.లావుగా మారే చేతులు(బింగో వింగ్స్)
వయసు పైబడుతున్న పురుషుల టాప్ ఐదు భయాలు
1.పురుషులకు వచ్చే వక్షాలు(మ్యాన్ బూబ్స్)
2.పలుచబడే జుట్టు
3.డబుల్ చిన్
4.భారీ పొట్ట
5.జుట్టురంగు మారడం