యూకే,యూరప్లో యప్ టీవీ... సన్ నెట్వర్క్ | YuppTV launches Sun TV Network channels for UK, Europe | Sakshi
Sakshi News home page

యూకే,యూరప్లో యప్ టీవీ... సన్ నెట్వర్క్

Published Sat, Oct 4 2014 1:10 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

YuppTV launches Sun TV Network channels for UK, Europe

హైదరాబాద్ : యూకే, యూరప్లలో సన్ టీవీ నెట్వర్క్ చానల్స్ అందుబాటులోకి వచ్చాయి.  మార్కెట్లో అగ్రగామిగా ఉంటూ, ప్రపంచవ్యాప్తంగా కూడా వీక్షకులకు అత్యున్నత స్థాయి కంటెంట్ను అందించేందుకు కొనసాగిస్తున్న ప్రయాణంలోభాగంగా యప్ టీవీ ప్రతిష్టాత్మక సన్ నెట్వర్క్కు చెందిన ప్రజాదరణ పొందిన చానల్స్ను యూకే, యూపరప్లోని వీక్షకుల కోసం ఆవిష్కరించింది.

ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నెట్పై భారతీయ, అంతర్జాతీయ టీవీ చానళ్లను పొందగలిగేలా చేయడం లక్ష్యంగా యప్ టీవీ ప్రస్తుతం అత్యుత్తమ నెట్వర్క్ ఆఫర్లను ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో యూకే, యూరప్ అంతటా ఉన్న వీక్షకుల కోసం అందిస్తోంది.

ఈ సందర్భంగా యప్ టీవీ సీఈఓ ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ ఆసియాకు చెందిన అతిపెద్ద, అత్యంత అభిమానపాత్రమైన టెలివిజన్ నెట్వర్క్లలో సన్ టీవీ నెట్వర్క్ కూడా ఉందని, భారతీయ వీక్షకులు అత్యత్తమంగా భావించే చానళ్లను ఇప్పుడు యూకే, యూరప్ అంతటా అందించటం ఆనంద దాయకమన్నారు.

ఆసియాకు చెందిన అమిత ప్రజాదరణ గల సన్ టీవీ నెట్వర్క్ దేశవ్యాప్తంగా వివిధ రకాల టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లు బహుభాషల్లో కలిగి ఉంది. సన్ టీవీ నెట్ వర్క్ సోప్ ఒపెరాలు, గేమ్ షోలు, మూవీలు, కామెడీ, వార్తా ప్రసారాలు, వినోద కార్యక్రమాలతో సహా విస్తృత శ్రేణి షోలను ప్రసారం చేస్తోంది.

యప్ టీవీ
దక్షిణాసియా కంటెంట్, లైవ్ టీవీ, క్యాచ్ అప్ టీవీ, ఆన్ డిమాండ్ మూవీ సొల్యూషన్స్కు సంబంధించి యప్ టీవీ ప్రపంచపు అగ్రగామి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కంటెంట్ ప్లేయర్గా ఎదిగింది. జార్జియాలోని అట్లాంట ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. యప్ టీవీ 200కు పైగా టీవీ చానళ్లు, 4500 వీడియోలు, అపరిమిత మూవీలు, లైవ్ ఈవెంట్స్ ఇంకా మరెన్నో అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement